తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​: జనరల్​ ఆస్పత్రిలో ఐసోలేషన్​ వార్డు - doctor ram kisan on corona

మహబూబ్​నగర్​లో ఇప్పటివరకు ఎటువంటి కరోనా కేసులు నమోదుకాలేదని జనరల్​ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాం కిషన్ తెలిపారు. ముందు జాగ్రత్తగా 30 పడకలతో ఐసోలేషన్​ వార్డు ఏర్పాటు చేశామన్నారు.

doctor ram kisan
కరోనా ఎఫెక్ట్​: జనరల్​ ఆస్పత్రిలో ఐసోలేషన్​ వార్డు

By

Published : Mar 5, 2020, 9:37 AM IST

కరోనా అంశంలో పాలమూరు వాసులు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని మహబూబ్​నగర్​ జనరల్​ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాం కిషన్ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. జిల్లా ఆస్పత్రిలో 30 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామన్నారు.

కరోనా ప్రభావం ఉన్న దేశాల నుంచి ఎవరైనా జిల్లాకు వస్తే.. వారికి కౌన్సిలింగ్ ఇస్తామని, హౌస్ ఐసోలేషన్​పై అవగాహన కల్పిస్తామన్నారు. నోడల్ సెంటర్ సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమానితుల రక్త నమూనాల సేకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. వ్యక్తిగత భద్రత పరికరాలు, మాస్క్​లు కావాల్సినన్ని అందుబాటులో ఉన్నట్లు వివరించారు.

కరోనా ఎఫెక్ట్​: జనరల్​ ఆస్పత్రిలో ఐసోలేషన్​ వార్డు

ఇవీచూడండి:కరోనాపై ప్రముఖుల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details