నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. సమావేశానికి 60 మంది కమిటీ సభ్యులు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో వార్డు నుంచి కేవలం ఐదారుగురు రావడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికే రాని వారు ఇక పట్టణ ప్రగతిలో ఏమి పాలుపంచుకుంటారని ప్రశ్నించారు?
'కలెక్టర్ సమావేశమంటే లెక్కలేదా..? - nagar karnool dist latest news
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సమీక్షలో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి 60 మంది రాకపోవడంపై మండిపడ్డారు.
పట్టణ ప్రగతి సమీక్ష
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. నూతన మున్సిపల్ చట్టానికి అనుగుణంగా కౌన్సిలర్లు పనిచేయాలని, లేకుంటే పదవులు ఊడతాయని అధికారులకు హెచ్చరించారు.
ఇవీ చూడండి:మైండ్స్పేస్లో రేపటి నుంచి యథావిధిగానే కార్యకలాపాలు'