కల్వకుర్తి పట్టణంలో కళ్యాణ్ నగర్ కాలనీలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3,08,200 నగదు, ఐదు ద్విచక్ర వాహనాలు, 5 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు కల్వకుర్తి ఎస్ఐ మహేందర్ వివరించారు.
ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్