తెలంగాణ

telangana

ETV Bharat / city

JP Nadda Comments On TRS: 'తెరాస అంటే... తెలంగాణ రజాకార్‌ సమితి' - Mahabubnagar News

JP Nadda Comments On TRS: దేశంలోనే అత్యంత అవినీతి సర్కార్‌... కేసీఆర్​ ప్రభుత్వమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. కేసీఆర్​ పాలనా వైఫల్యాలను పాలమూరు బహిరంగ సభలో ప్రజలకు ఏకరవు పెట్టారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి రాజకీయ లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. మోదీ సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందడం లేదన్న నడ్డా... రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని పునరుద్ఘాటించారు.

JP Nadda
JP Nadda

By

Published : May 6, 2022, 5:05 AM IST

JP Nadda Comments On TRS: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మహబూబ్‌నగర్‌లో 'జనం గోస-భాజపా' భరోసా పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో నడ్డా పాల్గొన్నారు. బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతుందన్నారు. దుబ్బాక, హూజూర్‌నగర్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారనివ్యాఖ్యానించారు. 8ఏళ్ల తెరాస వైఫల్యాలపై జేపీనడ్డా విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యంత అవినీతి సర్కారంటూ జేపీ నడ్డా ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ సర్కారు...దేశంలోనే అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారింది. ప్రాజెక్టు విలువ రూ. 20 వేల కోట్లు అయితే...ఇప్పుడు రూ. లక్షా 20 వేల కోట్లకు చేరింది. అయినప్పటికీ ఒక్క ఇంచు భూమికి కూడా సాగునీరు అందలేదు. అందుకే నేను మీకు చెబుతున్నా... ఇక్కడ తప్పుడు వ్యక్తి ఉన్నట్లయితే కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు, పథకాలు ప్రజల వద్దకు చేరవు. ఎప్పుడైతే సరైన డబుల్‌ ఇంజిన్ సర్కారు వస్తుందో... ప్రజలకు రెండింతల మేలు జరుగుతుంది.

-- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

కేంద్ర పథకాల పేర్ల మార్చి కేసీఆర్‌ రాజకీయ లబ్ది పొందుతున్నారని జేపీ నడ్డా ఆరోపించారు. సర్వశిక్ష అభియాన్‌, ఆయుష్మాన్‌ భారత్‌ వంటివి ప్రజలకందకుండా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో తెరాస అమలు చేస్తున్న ప్రతి పథకం పూర్తిగా అవినీతిమయమన్నారు. రాష్ట్రంలో భాజపా సర్కారు కచ్చితంగా వస్తుందని జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు.

మిషన్‌ కాకతీయలో అవినీతి జరిగిందా లేదా? మిషన్‌ భగీరథలో అక్రమాలు జరిగాయా? లేదా చెప్పండి. ఇప్పటివరకు ఆ నీరు అందలేదు. హరితహారంలో కూడా అవినీతి జరిగిందా లేదా? ఇదే తరహాలో కేసీఆర్‌ ప్రభుత్వం ల్యాండ్‌ మాఫియా చేస్తుందా.. లేదా..? ఈ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు..తెలంగాణ రజాకార్ల సమితి. నేను కేసీఆర్‌కు ఒక్కటే చెబుతున్నా...భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా మీ ప్రభుత్వాన్ని గద్దె దించుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను.

-- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ప్రగతిభవన్​.. ప్రజాభవన్​గా: 2023 ఎన్నికల్లో తెరాస ఓడిపోతుందన్న భయం కేసీఆర్​కు పట్టుకుందని... కుమారుడుని ముఖ్యమంత్రిని చేసేందుకు తహతహలాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. భాజపాపై కక్ష గట్టి ధాన్యం, కరెంటు, కేంద్ర పథకాల విషయంలో విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెరాసను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్న కిషన్‌ రెడ్డి... భాజపా అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను తెలంగాణ ప్రజాభవన్‌గా మార్చుతామన్నారు.

పరిహారం చెల్లించాలి: అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... అన్నదాతలకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. భాజపాకు సహకరిస్తే... ఆరు నెలల్లో ఆర్డీఎస్ ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. జీం నెంబర్ 69 ద్వారా నారాయణపేట జిల్లాకు సాగునీరు అందిస్తామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. గ్రూప్-1 పరీక్ష ఉర్దూలో నిర్వహించడం వల్ల యువతకు అన్యాయం జరుగుతుందని బండి సంజయ్‌ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయం జెండా ఎగురడం ఖాయమని పలువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details