'తెరాస ఓడిపోతుందనే భయంతోనే భాజపాపై అక్రమ కేసులు' - భాజపా నాయకులపై అక్రమ కేసులు
భాజాపా నేతల అక్రమ అరెస్టుకు నిరసనగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. దుబ్బాక ఉపఎన్నికల్లో తెరాస ఓడిపోతుందనే భయంతోనే భాజపా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా తెరాస ప్రభత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని భాజపా నేతలు మండిపడ్డారు. ఆ పార్టీ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.
దుబ్బాక ఉపఎన్నికల్లో తెరాస ఒడిపోతుందనే భయంతోనే భాజపా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అధికారం ఉందనే అహంకారంతో... అధికారులను అడ్డగోలుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. భాజపాకు సంబంధించిన ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చేస్తూ... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక సోదాల ఘటనకు కారణమైన సీపీని సస్పెండ్ చేయాలని.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.