ఏటీఎం చోరీకి విఫలయత్నం - ATM Robbery Failed In Narayanapet District
గుర్తు తెలియని వ్యక్తులు యూనియన్ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం చేసిన ఘటన నారాయణపేట జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు ఉన్న యూనియన్ బ్యాంకు ఏటీఎం చోరీకి గుర్తు తెలియని వ్యక్తులు విఫల యత్నం చేశారు. లాక్డౌన్ నేపధ్యంలో అధికారులంతా ఆ సేవల్లో నిమగ్నమై ఉండడం, జనసంచారం పెద్దగా లేకపోవడం వల్ల దుండగులు చోరీకి పథకం వేశారు. ముందుగా సీసీ కెమెరాలు తొలగించి డబ్బులు వచ్చే ర్యాక్‌ను ధ్వంసం చేశారు. డబ్బులు ఉంచే పెట్టె డోర్ పెకిలించి పెద్ద మొత్తంలో డబ్బులు దొంగిలిద్దామని ప్రయత్నించి విఫలమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బ్యాంకు మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనపై డీఎస్పీ మధుసూదనరావు, ఎస్సై చంద్రమోహన్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
ఏటీఎం చోరీకి విఫలయత్నం