తెలంగాణ

telangana

ETV Bharat / city

కొలువు చేస్తూనే.. కార్టూన్లు గీస్తూ ఔరా అనిపిస్తున్న ప్రభుత్వోద్యోగి

Cartoonist: ఒక్క చిత్రం ఎన్నో భావాలను పలికిస్తుంది. మరెన్నో మనసులను కదిలిస్తుంది. ఇక వ్యంగ్య చిత్రాలైతే అందర్నీ ఆలోచింపజేస్తాయి. అలాంటి కార్టూన్లను ప్రవృత్తిగా మలుచుకున్నారు ఓ ప్రభుత్వోద్యోగి. సామాజిక, రాజకీయ, సాంఘిక అంశాలను స్పుృశించడమే కాక విధానపర నిర్ణయాల్లోని లోపాలకు హాస్యాన్ని జోడించి ఎత్తి చూపుతున్నారు. అందరి మన్ననలను పొందుతున్నారు.

An extinct government employee in cartoons
An extinct government employee in cartoons

By

Published : Jun 27, 2022, 3:15 AM IST

Updated : Jun 27, 2022, 6:34 AM IST

కొలువు చేస్తూనే.. కార్టూన్లు గీస్తూ ఔరా అనిపిస్తున్న ప్రభుత్వోద్యోగి

Cartoonist: గద్వాల గండిపేట కాలనీకి చెందిన విష్ణు నీటిపారుదలశాఖలో పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచే వ్యంగ్య చిత్రాలను గీయడంపై ఆసక్తిని పెంచుకుని అలవాటుగా చేసుకున్నారు. సమాజంలోని సామాజిక రుగ్మతలపై కార్టూన్లు గీసే ఆయన ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన నిలిచి వారి గొంతుకయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్​ వల్ల కలిగే నష్టాలను హాస్యంగా చెబుతూ కార్టూన్లు గీశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా వ్యంగ్య చిత్రాల ద్వారా అవగాన కల్పించారు.

వివిధ వర్తమాన అంశాలపై తన కరుకైన కార్టూన్లతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు. అక్షరాస్యత, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, నిరుద్యోగుల సమస్యలు ఇలా ఏ అంశంపైనైనా ఇట్టే కార్టూన్లు గీయడంలో విష్ణు దిట్ట. ప్రజా సంఘాలు చేపట్టే ఏ కార్యక్రమానికైనా... ఉచితంగానే విష్ణు కార్టూన్లు గీసి ఇస్తారు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే వ్యంగ్యచిత్రాలను గీయడంలో ఆరితేరారు. సర్కారీ కొలువు చేస్తూనే ఖాళీ సమయాల్లో కార్టూన్లు గీస్తూ తన వంతు సామాజిక బాధ్యతను నిరాటంకంగా నిర్వర్తిస్తున్నారు. గతంలో విష్ణు గీసిన కార్టూన్లు ... గద్వాల జిల్లా సాధనకే కాకుండా ఆర్వోబీ మంజూరుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కార్టూన్ల ద్వారా సమాజహితానికి తన వంతు కళాసేవ చేస్తున్న విష్ణును తోటి ఉద్యోగులు, స్నేహితులు అభినందిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 27, 2022, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details