Sharmila: వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. వైతెపా జైత్రయాత్ర, జెండా పాలేరు నుంచే ఎగరాలని ఆమె ఆకాంక్షించారు. నేలకొండపల్లిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాలేరు నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్‌ఆర్ అంటే ఎక్కువగా అభిమానించే వారంతా పాలేరులోనే ఉన్నారని.. అందుకే ఇక్కడి నుంచి పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తా: షర్మిల - పాలేరు నుంచి పోటీ చేయనున్న షర్మిల
Sharmila: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. వైతెపా జైత్రయాత్ర, జెండా పాలేరు నుంచే ఎగరాలని ఆమె ఆకాంక్షించారు. వైఎస్సార్ అంటే ఎక్కువగా అభిమానించే వారంతా పాలేరులోనే ఉన్నారని.. అందుకే ఇక్కడి నుంచి పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు.
Sharmila
'ఖమ్మం జిల్లా పాలేరు నుంచే పోటీ చేయాలనేది ప్రజల కోరిక. వారి కోరిక మేరకు పాలేరు నుంచి పోటీ చేస్తా. వైఎస్‌ఆర్ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలి. చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీ కోసం పని చేద్దాం. పాలేరు నియోజకవర్గం దిశా -నిర్దేశం కావాలి. ఎక్కడ అవసరం అయితే అక్కడ పోరాటం చేయాలి.'-షర్మిల, వైతెపా అధ్యక్షురాలు
ఇవీ చూడండి: