తెలంగాణ

telangana

ETV Bharat / city

షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా - ఎన్నికల కోడ్​తో షర్మిల పర్యటన వాయిదా

వైఎస్​ షర్మిల తలపెట్టిన ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున... వాయిదా వేసుకున్నట్టు ఆమె సన్నిహుతులు తెలిపారు. ఎన్నికల అనంతరం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

ys sharmila khammam tour postpone due to mlc election code of conduct
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​తో షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా

By

Published : Feb 13, 2021, 5:38 PM IST

వైఎస్​ షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. తెలంగాణలో వైఎస్​ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా... ఈ నెల 9న హైదరాబాద్​లోని ఆమె నివాసం లోటస్ పాండ్​లో నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం కొత్త పార్టీ పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం వైఎస్సాఆర్​ అభిమానుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

సమావేశాలకు లోటస్​ పాండ్​ సరిపోదని భావించిన షర్మిల... జిల్లాల్లోనే పర్యటించాలని నిర్ణయించారు. ఈ నెల 21న ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున... ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకున్నట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశం కానున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:రాజన్న రాజ్యం కోసం ఖమ్మం జిల్లాలో షర్మిల పర్యటన

ABOUT THE AUTHOR

...view details