తెలంగాణ

telangana

ETV Bharat / city

రామన్నగూడెం  @ 95%.. అందరూ గిరిజనులే... !

అదో గిరిజన గ్రామం. పోలింగ్ అంటే ఆ ఊరిలో పండగ. అదేంటి చదువుకున్నోల్లే టీవీల ముందు టైంపాస్​ చేస్తుంటే వారికి అంత ఆసక్తేంటని ఆశ్చర్యంగా ఉందా..? అలాంటి సందేహం రావడం సహజమే. కానీ వారిది ఒకే మాట.. ఒకే బాట.. ఎక్కడున్నా ఊరికొచ్చి ఓటేయాల్సిందే.

అక్కడ పోలింగ్​ రోజు పండగ వాతావరణం

By

Published : Apr 2, 2019, 10:17 PM IST

అక్కడ పోలింగ్​ రోజు పండగ వాతావరణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గిరిజనులు ఓటు హక్కు వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్నిక ఏదైనా...95శాతం పోలింగ్ తగ్గదు. 2014లో సార్వత్రిక ఎన్నికల్లో 98 శాతం, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 97, ఇటీవల జరిగిన పంచాయతీ సంగ్రామంలో 96.74శాతంగా నమోదైంది. 700మంది గ్రామ జనాభాలో 317ఓటర్లున్నారు.స్థానికంగా ఉండేవారే కాకుండా... జీవనోపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లినవారూ తప్పకుండా వచ్చి ఓటేస్తారు. ఆ రోజు ఊరంతా పండగ వాతావరణం సంతరించుకుంటుంది.

వాళ్ల ఐకమత్యం చూస్తే ముచ్చటేస్తది. ఎలాంటి సమస్యనైనా...కలిసికట్టుగా ఊర్లోనే పరిష్కరించుకుంటారు. అంతేనా...ప్రభుత్వ పథకాల వినియోగంలోనూ వారిది ముందడుగే. నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించుకొని స్వచ్ఛతలోనూ ఆదర్శంగా నిలిచారు. మంజూరైన 20 రెండు పడకగదుల ఇళ్లు నిర్మాణంలో ఉండగా...ఊరంతా సీసీ రోడ్లతో అభివృద్ధిలోనూ దూసుకుపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details