ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం గ్రామస్తులు సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అసైన్డ్ భూముల్లో గిరిజనేతరులను తొలగించి గిరిజనులకు పట్టాలు ఇవ్వాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
మా భూములు మాకు ఇప్పించండి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు, రుద్రాక్షపల్లి గ్రామాలకు చెందిన భూములు ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. తమ భూములు తమకు ఇప్పించాలంటూ ఇరు గ్రామాల ప్రజలు పాదయాత్ర చేస్తూ నిరసన తెలిపారు,.
బుగ్గపాడు, రుద్రాక్షపల్లి గ్రామాలకు చెందిన గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములను గిరిజనేతరులు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూముల్ని తమకు ఇప్పించాలని కోరారు. దీనిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేన్నందునే.. ఈ పాదయాత్ర చేపట్టామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జాగిరి శీను తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో పెత్తందార్లు గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య చిచ్చు పెట్టి భూములు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల లెనిన్ ఆరోపించారు.
ఇవీ చూడండి:చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు