బక్రీద్ సందర్భంగా నమాజ్ చేసి వచ్చారు. మధ్యాహ్నం ఇంట్లో అందరితో కలిసి భోజనం చేశారు. ఆడుకుంటామని వెళ్లిన పిల్లలు... ఇక లేరని తెలిసి ఆ తల్లిదండ్రుల కడుపుకోత అంతాఇంతా కాదు. ఖమ్మం నగర శివారులోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ నాగుల్ మీరా, షేక్ మున్నా ఇద్దరు బావబామ్మర్దులు. నమాజ్ తర్వాత ఇంట్లో భోజనం చేసి ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. చాలా సేపైనా ఇంటికి రాకపోవటం వల్ల తల్లిదండ్రులు వెతికారు. సమీపంలోని డోలమైట్ క్వారీలో చిన్నారుల దస్తులు గుర్తించిన స్థానికుల సమాచారంతో వెతకగా... విగత జీవులై కనిపించారు. కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
డోలమైడ్ క్వారీలో పడి ఇద్దరు బాలురు మృతి - died in dolamite quari
ఖమ్మం నగర శివారు వైఎస్ఆర్ కాలనీ చెందిన ఇద్దరు బాలురు మృతి చెందారు. ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరు సమీపంలోని డోలమైట్ క్వారీలో పడి చనిపోయారు.
డోలమైడ్ క్వారీలో పడి ఇద్దరు బాలురు మృత్యువాత