తెలంగాణ

telangana

ETV Bharat / city

mla ramulu naiak: తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే.. తెరాస ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు - ఎమ్మెల్యే రాములు నాయక్​ వైరల్​ స్పీచ్​

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీయేనని... మనమందరం ఆమెకు థాంక్స్ చెప్పాలన్నారు తెరాస ఎమ్మెల్యే రాములు నాయక్​. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈవిధంగా వ్యాఖ్యానించారు.

trs mla ramulu nayak
trs mla ramulu nayak

By

Published : Aug 24, 2021, 8:23 PM IST

నిత్యం వార్తల్లో నిలిచే ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్... ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారేపల్లి మండలంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన.... 2014లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చనిపోయే పరిస్థితిలో ఉన్నారని గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని పేర్కొన్నారు. అందుకు ఆమెకు థాంక్స్​ చెప్పాలన్నారు.

20 ఏళ్లు కొట్లాడి.. చివరికి చచ్చిపోయే పరిస్థితి వరకు పోయి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. అమ్మ సోనియాగాంధీగారు ఇచ్చారు. ఆమెకు థాంక్స్​ చెప్పాలి. ఎందుకంటే ఆమెకు కూడా తెలుసు తెలంగాణ బిడ్డలు వివక్షతకు గురవుతున్నారని. ఎడారి ప్రాంతంలో ఉన్నారు. వనరులన్నీ పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నియామకాలు లేవు. ఈ మూడింట్లోనూ తెలంగాణ వాసులు దగా పడుతున్నారని గ్రహించి ప్రత్యేక రాష్ట్రం ఫైలుపై సంతకం పెట్టేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మన వనరులను మనం అనుభవిస్తున్నాం. ఆ రోజుల్లో పక్కకుపోయిన వనరులే ఇవాళ మనం తింటున్నాం కాబట్టి... మనం ఎక్కడా ఒడిదొడుకులు లేకుండా ప్రతి గూడెం, ప్రతి కుటుంబంలో ఆనందంగా ఉంటున్నాం. ప్రతి గుడిసె కూడా రేపు డబుల్​బెడ్​రూం అవుతుంది. బియ్యము ఇస్తాం, పింఛను ఇస్తాం, రైతుబంధు ఇస్తాం, రైతు బీమా ఇస్తాం. ఉచిత విద్యుత్​ ఇస్తాం.

-రాములు నాయక్​, వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే.

తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే... ఆమెకు థాంక్స్​ చెప్పాలి

ఇదీ చూడండి:భవిష్యత్​లో... బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలబంధు: కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details