తెలంగాణ

telangana

ETV Bharat / city

గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ - khammam dist latest news

ఖమ్మం జిల్లా ఏన్కూరులో 25 పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను వైరా ఎమ్మెల్యే సర్పంచ్​లకు అందజేశారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తసేకరణ, మొక్కల సంరక్షణ చేపడుతూ హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు.

tractors distribute to panchayath's
గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ

By

Published : Mar 4, 2020, 9:58 PM IST

పల్లెలు ఆరోగ్యవంతంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో 25 పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను సర్పంచ్​లకు పంపిణీ చేశారు. ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో పలుచోట్ల అంతర్గత సీసీ రహదారులకు శంకుస్థాపనలు చేశారు.

ప్రతి గ్రామం పచ్చగా ఉండాలనే లక్ష్యంతోనే హరితహారం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అందుకే పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు మంజూరు చేశారన్నారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తసేకరణ, మొక్కల సంరక్షణ చేపడుతూ ప్రభుత్వం చేపట్టిన లక్ష్యాలను సాధించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ

ఇవీ చూడండి:ఆ రాష్ట్రానికి ఇక 2 రాజధానులు- సీఎం కీలక ప్రకటన

ABOUT THE AUTHOR

...view details