Bhadradri Temple News: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో టికెట్ ధరలు పెంచుతూ ఆలయ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న 100 గ్రాముల చిన్న లడ్డును రూ.20 నుంచి రూ.25కు, పులిహోర రూ.10 నుంచి రూ. 15కు, చక్కెరపొంగిలి రూ.10 నుంచి రూ.15కు, కేశఖండన టిక్కెట్ రూ.15 నుంచి రూ.20కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ. 100 ఉన్న మహాలడ్డును 500 గ్రాముల నుంచి 400 గ్రాములకు తగ్గించారు. నిత్యకల్యాణం రూ.1,500, అర్చన రూ.300, అభిషేకం టికెట్ రూ.1,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త టికెట్ల ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని దేవస్థానం పేర్కొంది.
ఆ ప్రముఖ పుణ్యక్షేత్రంలో పెరిగిన టికెట్ ధరలు - భద్రాద్రిలో టికెట్ ధరలు పెంపు
Bhadradri Temple News:ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో టికెట్ ధరలు పెరిగాయి. కొత్త టికెట్ల ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని దేవస్థానం పేర్కొంది.
Bhadradri Temple