నాయకుల మధ్య ఉన్న పొరపొచ్చాలను అధిగమించి కార్యకర్తలను ఒకే తాటిపై నడిపించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం గ్రామీణ మండలంలో పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈనెల 4న ఖమ్మంలో నిర్వహిస్తున్న కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని తుమ్మల కోరారు.
కార్యకర్తలను ఒకే తాటిపై నడిపించాలి