ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని ఆధార్ ఏటీఎం కేంద్రంలో దొంగతనం జరిగింది. అప్రమత్తమైన పోలీసులు ముదిగొండ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎటువంటి పత్రాలు లేకుండా ఆటో నడుపుతూ అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
ఏటీఎం కేంద్రంలో చోరీ.. దొంగ అరెస్ట్ - khammam dist latest news
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని ఆధార్ ఏటీఎం కేంద్రంలో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. ముదిగొండ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కాశిరాజు గూడెనికి చెందిన ఇమ్మడి వెంకటేశ్వర్లు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా తానే చోరికి పాల్పడినట్లు అంగీకరించాడు.
ముదిగొండ ఆధార్ ఏటీఎం కేంద్రంలో చోరి.. దొంగ అరెస్ట్
ఖమ్మం రూరల్ మండలం కాశిరాజు గూడెనికి చెందిన ఇమ్మడి వెంకటేశ్వర్లు ఆధార్ ఎటీఎం కేంద్రంలో డబ్బులు దొంగలించాడు. అతడ్ని విచారించగా తానే చోరికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి రూ.1.27 లక్షస నగదు, ఓ ఆటో స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి:బాలికపై నలుగురు 'అత్యాచారం'.. గర్భం దాల్చగా వెలుగులోకి!