తెలంగాణ

telangana

ETV Bharat / city

Podu lands issue: మళ్లీ పోడు లొల్లి... ఆదివాసీలు, అధికారులకు మధ్య ఘర్షణ - పోడు భూములు

Podu lands issue: రాష్ట్రంలో పోడు భూముల రగడ ఆగటం లేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవటంతో.... నిత్యం ఏదో ఒక చోట ఆదివాసీలకు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో పోడు పోరుతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. తాజాగా... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరో ఘటన చోటుచేసుకుంది.

Podu farmers
పోడు భూముల సమస్య

By

Published : Mar 25, 2022, 6:50 PM IST

Podu lands issue: పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవటంతో.... నిత్యం ఏదో ఒక చోట ఆదివాసీలకు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అలాంటిదే మరో ఘటన జరిగింది.

వాహనాలను అడ్డుకున్న రైతులు..

Podu controversy: టేకులపల్లి మండలం జంగాలపల్లి బీట్‌ పరిధిలో ఉన్న.... ఆళ్లపల్లి మండలం రాయపాడులో పోడు రైతులకు, అటవీ అధికారులకు మధ్య ఘర్షణ నెలకొంది. సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో కందకం పనులు చేయించేందుకు అటవీశాఖ అధికారులు యంత్రాలతో వచ్చారు. విషయం తెలుసుకున్న ఆ భూములకు చెందిన రైతులు అక్కడి చేరుకుని.... వాహనాలను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోడు భూముల దరఖాస్తుల పరిశీలన ఉండగానే.... తమకు జీవనాధారమైన పొలాలను లాక్కునేందుకు యత్నించటం సరికాదని బాధితులు వాపోయారు. దశాబ్దాలుగా పోడు భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని... భూములకు పట్టాలు వస్తాయని ఆశ పడుతున్న తమకు అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యంత్రాలతో పనులు ప్రారంభించిన అటవీ సిబ్బంది, పోడు రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పనులను నిలిపివేశారు.

రాయపాడులో పోడు రైతులకు - అటవీ అధికారులకు మధ్య ఘర్షణ

ఇదీ చదవండి:TET 2022: ఉపాధ్యాయ అర్హత పరీక్ష వారు కూడా రాసుకోవచ్చు

ABOUT THE AUTHOR

...view details