తెలంగాణ

telangana

ETV Bharat / city

ఖమ్మం నియోజకవర్గంలో 38 నామినేషన్లు - tg-kmm mp-nominations

ఖమ్మం పార్లమెంట్ స్థానంలో నామినేషన్ల పర్వం కోలాహలంగా సాగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించి నామపత్రాలు దాఖలు చేశారు. మొత్తం 38 నామినేషన్లు వచ్చాయి.

ఖమ్మంలో 38 నామపత్రాలు దాఖలు

By

Published : Mar 26, 2019, 7:10 AM IST

Updated : Mar 26, 2019, 12:32 PM IST

ఖమ్మంలో 38 నామపత్రాలు దాఖలు
ఖమ్మం లోక్​సభ ఎన్నికల బరిలో నిలిచిన తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఉదయం తన నివాసంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పార్టీ నేతలతో కలిసి అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఎస్​ఆర్​ బీజీఎన్​ఆర్​ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్​కు బయలుదేరారు. మాజీ మంత్రి తుమ్మల, తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇతర నేతలతో కలిసి రిటర్నింగ్​ అధికారికి నామ పత్రాలు అందజేశారు.

పార్టీ కార్యాలయం నుంచి..

కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి కూడా భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. జిల్లా హస్తం పార్టీ కార్యాలయం నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, సీనియర్​ నేతలు మర్రి శశిధర్​ రెడ్డి, వీహెచ్​, భట్టి విక్రమార్కతో కలిసి నామినేషన్ వేశారు.

38 నామపత్రాలు:

భాజపా తరఫున వాసుదేవరావు, న్యూడెమోక్రసీ నుంచి వెంకటేశ్వరరావుతో పాటు మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారు. ఖమ్మం లోక్​సభ స్థానానికి 38 నామపత్రాలు దాఖలైనట్లు సమాచారం.

ఇదీ చదవండిఃతెరాస ప్రచార తార జాబితాలో హరీశ్​

Last Updated : Mar 26, 2019, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details