తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం మోటాపురంలో నందమూరి తారకరామారావు విగ్రహాన్ని నందమూరి సుహాసిని ఆవిష్కరించారు. ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నారని సుహాసిని అన్నారు. పట్వారీ వ్యవస్థను రూపుమాపి మండలాల వ్యవస్థను ప్రారంభించారని తెలిపారు.
మోటాపురంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ - khammam district news
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం మోటాపురంలో నందమూరి తారకరామారావు విగ్రహాన్ని నందమూరి సుహాసిని ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో తెదేపా పునరుజ్జీవనం పోసుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందని సుహాసిని అన్నారు.
![మోటాపురంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ tdp formation, tdp formation day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11207514-523-11207514-1617068727149.jpg)
తెదేపా, తెదేపా ఆవిర్భావ దినం
తెలుగు రాష్ట్రాల్లో తెదేపా పునరుజ్జీవనం పోసుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందని సుహాసిని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి :నేడు తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం