ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలో ట్యాంకర్ చెట్టుకు ఢీకొట్టి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి తారు నింపి వస్తున్న ట్యాంకర్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ట్యాంకర్ డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తుమ్మలపల్లికి చెందిన నరేశ్ లారీ, ట్యాంకర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఘటనా స్థలానికి 30 కిలోమీటర్ల దూరంలోనే మృతుడి స్వస్థలం ఉండడం వల్ల కొద్దిసేపటికే మృతుడి కుటుంబీకులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. మృతుడి బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చెట్టును ఢీకొట్టిన ట్యాంకర్.. డ్రైవర్ మృతి - Tanker meets Accident Driver Died In Khammam
ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలో ట్యాంకర్ చెట్టుకు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
![చెట్టును ఢీకొట్టిన ట్యాంకర్.. డ్రైవర్ మృతి Tanker meets Accident Driver Died In Khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7022020-195-7022020-1588349665098.jpg)
చెట్టుకు ఢీకొట్టిన ట్యాంకర్.. డ్రైవర్ మృతి