ఖమ్మం జిల్లాలోని అన్నీ పంచాయతీల్లో బ్లీచింగ్, హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలో 16 టన్నుల బ్లీచింగ్, 6 టన్నుల హైపోక్లోరైడ్, 20 టన్నుల సాాధారణ పొడి అందుబాటులో సిద్దంగా ఉంచామన్నారు. ఎక్కడ అవసరమైనా యుద్ద ప్రాతిపదికన నివారణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
కరోనా నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - Strict arrangements for prevention of corona
ఖమ్మం జిల్లాలోని ఏ ఒక్క పంచాయతీలోనూ కరోనా పాజిటివ్‌కు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
వీటితోపాటు ప్రతి పంచాయతీలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం అమలు చేస్తున్నామన్నారు. 584 పంచాయతీల్లో 11 లక్షల జనాభాకు భద్రతగా అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నామని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మంజూరు చేసిన రూ.16 కోట్ల నిధులు ఏప్రిల్ 9న అన్నీ పంచాయతీలకు విడుదల చేశామని, వేసవిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తామని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి:లాక్డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్