తెలంగాణ

telangana

ETV Bharat / city

YS Sharmila Padayatra: పాలించడం చేతకాక తెరాస ధర్నాలు: షర్మిల - వైఎస్సార్ తెలంగాణ పార్టీ

YS Sharmila Padayatra: పాలించడం చేతకాక అధికార తెరాస ధర్నాలు చేస్తోందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మలో రైతువేదిక వద్ద షర్మిల ధర్నా నిర్వహించారు.

YS Sharmila
YS Sharmila

By

Published : Apr 7, 2022, 6:36 PM IST

YS Sharmila Padayatra:వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మలో రైతువేదిక వద్ద వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ధర్నా నిర్వహించారు. పరిపాలన చేతకాక అధికార పార్టీ ధర్నాలు చేస్తుందని ఆమె ఆరోపించారు. ప్రజలు ఎన్నుకుంది ప్రజాసమస్యలు పరిష్కరించాలనీ.. ధర్నాలు చేయడానికి కాదని షర్మిల ధ్వజమెత్తారు.

దిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు..

'రైతుల కోసం కొట్లాడుతున్నట్లు చెబుతున్న కేసీఆర్.. దిల్లీలో ఎందుకు సంతకం పెట్టారు. రైతు సంక్షేమమే ముఖ్యమైతే ఆ రోజు కేంద్రం వద్ద సంతకం పెట్టకుండా దిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే కేసీఆర్‌ ఎందుకు నిలదీయలేదు.. ? ఖమ్మం జిల్లా మంత్రి అజయ్ కుమార్ ఎవరి మీద ధర్నా చేస్తున్నారు. ధర్నా చేయాలనుకుంటే సీఎం మీద చేయాలి. పరిపాలన చేతకాక, వడ్లు కొనలేక అధికార పార్టీ ధర్నాలు చేస్తుంది.'

-వైఎస్​ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలు లేవని అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పడిందని షర్మిల పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కేంద్రంపై తెరాస వరిపోరు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు

ABOUT THE AUTHOR

...view details