పెట్టబడిదారి వర్గాల ప్రయోజనాలను కాపాడడానికి నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చారని జిల్లా మాజీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి సుబ్బారావు ఆరోపించారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు ర్యాలీ చేశారు. మాజీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. ఖమ్మం ధర్నా చౌక్‌లో ఆందోళన చేపట్టారు.
రైతు ఉద్యమానికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల ర్యాలీ - తెలంగాణ వార్తలు
ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. చనిపోయిన రైతులకు సంఘీబావం ప్రకటించారు. అనంతరం ఖమ్మం ధర్నా చౌక్‌లో ఆందోళన చేపట్టారు. జిల్లా మాజీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
![రైతు ఉద్యమానికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల ర్యాలీ sfi old students rally to support farmers protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9949935-852-9949935-1608531350662.jpg)
రైతు ఉద్యమానికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల ర్యాలీ
ఒకవైపు పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తుంటే.. మరోవైపు కేంద్రం దుష్ప్రచారానికి పాల్పడుతోందని సుబ్బారావు విమర్శించారు. రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల కన్వీనర్ ఎ.ప్రదీప్‌కుమార్, కల్యాణం వెంకటేశ్వరరావు, ఎన్. వీరబాబు, వడ్డే వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, సరితా నగేష్, రఫీ, సత్యనారాయణ, ఖయ్యూం, అచ్యుతరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ... ఒకరు అరెస్ట్