Security forces defused landmine: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటుచేసిన ముందు పాతరలను జవానులు కనుగొన్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కీకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య రోజూ దాడి, ప్రతి దాడులు జరుగుతున్నాయి.
మందుపాతరను గుర్తించారు.. అలా పేల్చేశారు...
Security forces defused landmine: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటవీప్రాంతంలో మావోస్టులు అమర్చిన మందుపాతరలను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. పోలీసులను చంపటమే ప్రధాన ఉద్దేశంగా ఈ మందుపాతరలను పెట్టినట్టు జవానులు స్పష్టం చేశారు. 74 సీఆర్ఫీఎఫ్ బెటాలియన్ పోలీస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పేలుతున్న మందుపాతర
ఈ నేపథ్యంలో భద్రతా బలగాలపై మందుపాతరలు పేల్చి వేసేందుకు మావోయిస్టులు చేసిన పనిని జవానులు కనిపెట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలోని అరలంపల్లి, కిష్టారం మార్గమధ్యంలో పోలీసులను లక్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ మందుపాతరలు అమర్చారు. మార్గమధ్యలో అమర్చిన రెండు మందుపాతరలను భద్రతా బలగాలు కనుగొని నిర్వీర్యం చేశాయి. 74 సీఆర్ఫీఎఫ్ బెటాలియన్ పోలీస్ పరిధిలో ఈ ఘటన జరిగింది.