ఖమ్మం నగర పాలకంలో కుచించుకుపోతున్న వాగులు - river water news
ఖమ్మం నగర పాలకంలో వాగులు కుచించుకుపోతున్నాయి. వర్షాలు కురిసినప్పుడు వరద ప్రవాహానికి వాగులు పొంగి జనావాసాల్లోకి నీరు వచ్చి చేరుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
rivers damage in khammam city
ఖమ్మంలోని ప్రధానమైన చెరువుల పరిరక్షణకు నగరపాలక సంస్థ నడుం బిగించింది. ఇక్కడి బాలపేట, ఖానాపురం, లకారం చెరువులకు గొలుసుకట్టు వాగులు ఉన్నాయి. వీటిని దశాబ్దాలుగా పట్టించుకోకపోవటంతో తమ స్వరూపాన్ని కోల్పోయాయి. కొన్ని చోట్ల బాగానే ఉన్నా చాలాచోట్ల ఆక్రమణలతో కుచించుకుపోయాయి. వాగులను పరిరక్షించకుంటే పెద్ద వర్షాలు పడినప్పుడు నివాసాలు నీట మునిగే ప్రమాదముంది. ఆ వైపుగా నగరపాలకులు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.