Record Price for Mirchi : ఖమ్మం మార్కెట్ యార్డ్‌లో మిర్చి రికార్డు ధర పలికింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బంధం పల్లి గ్రామానికి చెందిన రైతుకు చెందిన మిర్చి క్వింటల్‌కు 23 వేలు చెల్లించి కొనుగోలు చేశారు. గురువారం రోజున యార్డులో 22 వేల 800 కు కొనుగోలు చేయగా నేడు మరింత ధర పలకటం విశేషం. వ్యవసాయ మార్కెట్‌లో వారం రోజులుగా ఎర్ర బంగారానికి అత్యధిక ధర పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ సమయంలో తక్కువ ధర పలుకుతుండటంతో ఏసీలో నిల్వచేసి ఇప్పుడు అమ్మినట్లు రైతు తెలిపారు.
క్వింటా మిర్చికి రూ.23వేలు.. ఎక్కడంటే..? - క్వింటా మిర్చికి 23 వేలు
Record Price for Mirchi : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఎర్రబంగారం మెరిసింది. మిరప.. రికార్డు ధర పలికింది. ఓ రైతు వద్ద మిరప పంటను క్వింటాకు రూ.23వేలు చెల్లించి కొనుగోలు చేశారు. మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావటం విశేషం.
గురువారం రోజున.. ఖమ్మం అర్బన్ మండలం అల్లీపురానికి చెందిన రావూరి సత్యనారాయణ అనే రైతుకు చెందిన 22 బస్తాల సరకును అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. కనిష్ఠధర రూ.17,600, నమూనా ధర రూ.20,000లు పలికింది. మార్కెట్‌కు ఏసీ మిరప 5,546 బస్తాలు, ఎండు మిరప 2,058 బస్తాలు, తాలు మిరప 265 బస్తాల సరకు వచ్చింది. తేజ రకం మిరపకు రికార్డు ధర పలుకుతుండటంతో శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన సరకును రైతులు తెచ్చి విపణిలో విక్రయిస్తున్నారు.
ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఏపీలోని పూర్వ కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు ఖమ్మం విపణిలో ఎక్కువగా తమ మిరప పంటను విక్రయిస్తున్నారు. ఈ నెల 1న ఏసీ మిరప క్వింటా ధర రూ.22,000 ఉండగా ప్రస్తుతం అది క్రమేణా పెరుగుతోంది.