ఖమ్మం పార్లమెంట్ సీటును గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. అధిష్ఠానం నిర్ణయానికి పొంగులేటి కట్టుబడి ఉంటారా..? నామ కోసం ప్రచారానికి దిగుతారా..? అనే ప్రశ్నలకు తెరదింపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి క్రమశిక్షణ గల కార్యకర్తగా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. నామను గెలుపించడానికి సర్వశక్తులొడ్డుతానని పొంగులేటి స్పష్టం చేశారు. శ్రీనివాస్ రెడ్డి మద్దతుతో మరింత బలం చేకూరిందని నామ నాగేశ్వరరావు తెలిపారు.
'గులాబీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం' - khammam
ఖమ్మం గుమ్మంలో తెరాస జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వర రావు తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కేసీఆర్కు బహుమతిగా ఇస్తామంటున్న ఇద్దరు నేతలతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
!['గులాబీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2856657-569-739be4f4-62a7-4fcb-a21e-31d71e292415.jpg)
'గులాబీ జెండా ఎగురవేయడమే మా లక్ష్యం'
Last Updated : Mar 31, 2019, 7:58 AM IST