భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో డ్రిల్లింగ్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ తలుపులకు రంధ్రాలు చేసి చోరీలకు యత్నిస్తున్నారు. గతంలో జరిగిన ఘటనలను తలచుకొని ప్రజలు భయాందోళనకు గురవుతుండగా.. పోలీసులకు ఈ కేసులు సవాల్‌గా మారుతున్నాయి.
ఇల్లందు పట్టణంలోని స్టేషన్ బస్తీలో వరుసగా రెండు రోజులపాటు ఎల్లమ్మ, ముత్తమ్మ అనే మహిళల ఇంట్లో చోరీకి విఫల యత్నం జరిగింది. ఇంటి వెనుక భాగంలో తలుపు గడియ ఉన్నదగ్గర డ్రిల్లింగ్ చేసేందుకు దుండగుడు యత్నించాడు. ఆ శబ్దానికి ఇంట్లోవాళ్లు లేవడం వల్ల అక్కడ నుంచి పారిపోయాడు.