Parents beats Head Master in Khammam : ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురంలోని ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న హెచ్‌ఎం రామారావు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు విద్యార్థినులు వారి కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. ఆగ్రహంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాల వద్దకు చేరుకొని హెచ్ఎం పై దాడి చేసి.. నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థుల పట్ల అసభ్యప్రవర్తన, ప్రిన్సిపల్‌కు తల్లిదండ్రుల దేహశుద్ధి - ఆగ్రహంతో తల్లిదండ్రులు గ్రామస్థులు హెచ్ఎం పై దాడి
Parents beats Head Master in Khammam విద్యాబుద్ధులు నేర్పే ప్రధానోపాధ్యాయుడే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు హెచ్ఎం పై దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురంలో చోటుచేసుకుంది. ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
Parents attack
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రధానోపాధ్యాయుడిని కొందరు స్థానికులు గ్రామంలోని ఓ ప్రజా ప్రతినిధి ఇంటికి తీసుకెళ్లారు. అయినా పరిస్థితి సద్ధుమణగకపోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు రామారావుని స్టేషన్‌కు తరలించారు. ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల ఆరోపణలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.