ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో మేడిపల్లి, కట్టకూరు, మాదాపురంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు సంయమనం పాటించాలని సూచించారు. రైతులకు సరిపడా వరికోత మిషన్‌లను దిగుమతి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి - ముదిగొండ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి
గతంలో జిల్లాలో వంద కొనుగోలు కేంద్రాలుంటే... వాటిని నాలుగు వందలకు పెంచినట్టు మంత్రి చెప్పారు. రైతులు ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, మేడిపల్లి సొసైటీ ఛైర్మన్ సామినేని వెంకటయ్య, జడ్పీటీసీ సభ్యురాలు భారతి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:వైరస్‌పై పోరులో 'జుగాడ్'- త్రీడీ ప్రింటర్‌తో మాస్కులు