ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ ట్రూనాట్ పరీక్షల కేంద్రాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మమత ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్, కొవిడ్ వార్డును ప్రారంభించారు. అనంతరం వైద్యాధికారులో మంత్రులు సమావేశమయ్యారు. నాలుగు నెలలుగా ప్రజలకు ధైర్యం చెప్పిన వైద్యులకు మంత్రి ఈటల అభినందనలు తెలిపారు.
''ప్రైవేటు వైద్యానికి ధీటుగా ప్రభుత్వ వైద్యం పనిచేస్తుంది. కరోనా వైరస్‌కి చంప గలిగే శక్తి లేదు.. నిర్లక్ష్యంగా ఉంటే చంపుతుంది. పాజిటివ్ కేసులలో 81శాతం ఎలాంటి లక్షణాలు లేవు. పాజిటివ్ కేసులలో 19శాతం లక్షణాలు ఉంటున్నాయి. పాజిటివ్ కేసులలో 14శాతం వైద్యుల చికిత్సతో నయం అవుతున్నాయి. వ్యాధులుండి కరోనా సోకినవారు 24గంటల్లో వైద్యులను సంప్రదించాలి. కరోనాతో శ్వాస ఆడటం లేదు అంటే నిర్లక్ష్యం వహించటమే.''