భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక పోస్టాఫీసు వద్ద ప్రజలు ప్రభుత్వం ఇస్తున్న రూ.1500 కోసం బారులు తీరారు. డబ్బులు తీసుకోవడానికి జనాలు ఎగబడి భౌతిక దూరం పాటించడం కూడా మరిచారు. ఉదయం నుంచే పోస్టాఫీసుకు చేరుకున్న మహిళలు భౌతిక దూరం పాటించకుండా డబ్బుల కోసం ఒక్కచోట గుమిగూడారు.
ప్రజలు దూరం పాటించలేదు.. అధికారులు పట్టించుకోలేదు! - badradri news
లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1500 తీసుకోడానికి ప్రజలు భౌతిక దూరం పాటించకుండా బారులు తీరారు. అక్కడే ఉన్న అధికారులు కూడా పట్టించుకోలేదు.
ప్రజలుదూరం పాటించలేదు.. అధికారులు పట్టించుకోలేదు!
అధికారులు, పోస్టాఫీసు సిబ్బంది సైతం బారులు తీరినప్రజలు భౌతిక దూరం పాటించేలా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోగా.. అక్కడే ఉన్నఅధికారులు పట్టించుకోలేదు. మహిళలు భౌతిక దూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తోపులాట జరిగి అందరూ ఒకచోట గుమిగూడాల్సి వచ్చిందని స్థానికులు ఆరోపించారు.
ఇవీచూడండి:మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన