తెలంగాణ

telangana

ETV Bharat / city

మారటోరియం గడువు డిసెంబర్​ 31వరకు పొడిగించండి: నామ - nama nageswara rao letter to central minister

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​కు తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు లేఖ రాశారు. ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం ఆగస్టు 31తో ముగియనున్న నేపథ్యంలో మరో నాలుగు నెలల పాటు లోన్​పై మారటోరియంను, ఇన్సూరెన్స్​ను పొడిగించాలని కోరారు.

మారటోరియం గడువు డిసెంబర్​ 31వరకు పొడిగించండి: నామా
మారటోరియం గడువు డిసెంబర్​ 31వరకు పొడిగించండి: నామా

By

Published : Aug 29, 2020, 8:20 PM IST

ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం ఆగస్టు 31తో ముగియనున్న నేపథ్యంలో మరో నాలుగు నెలల పాటు లోన్​పై మారటోరియంను, ఇన్సూరెన్స్​ను పొడిగించాలని తెలంగాణ లారీ ఓనర్స్​ అసోసియేషన్​​ నాయకులు తెరాస లోక్​సభా పక్ష నేత నామ నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. లారీ ఓనర్స్​ అసోసియేషన్ విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఎంపీ.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు.

కొద్ది నెలలుగా అంతర్రాష్ట్ర రవాణా నిలిచిపోయిందని, ఈ ప్రభావం రోడ్డు రవాణా రంగంపై తీవ్రంగా పడిందని, లాక్​డౌన్​ కారణంగా రవాణా రంగం తీవ్ర అనిశ్చితిలో ఉందని లేఖలో పేర్కొన్నారు. లాక్​డౌన్​ కారణంగా కిరాయి లేక, పెరుగుతున్న అప్పుల భారం భరించలేక.. లారీ యజమానులు ఆర్ధికంగా చితికిపోయారని వివరించారు. ఆర్ధిక కార్యకలాపాలు మందగించడం, ఇప్పట్లో పుంజుకుంటుందనే ఆశాభావం లేకపోవడంతో ఫైనాన్షియర్లకు వాహనాలు అప్పగించే దిశగా లారీ యజమానులు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియం, ఇన్సూరెన్స్​ను డిసెంబర్​ 31వరకు పొడిగించాలని నిర్మలా సీతారామన్​ను ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు.​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details