భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెరాస లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. 15వ లోక్ సభలో లీడర్ ఆఫ్ ద హౌస్‌గా ఉన్న సమయంలో ప్రణబ్‌తో కలసి పనిచేసిన విషయం ఈ సందర్భంగా ఎంపీ నామా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ బిల్లుపై రాజముద్ర వేయటం రాష్ట్ర ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్‌ది ప్రముఖ పాత్ర: నామ - మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఎంపీ నామా ప్రార్ధించారు.
రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ప్రముఖ పాత్ర పోషించారు: నామా
ప్రణబ్ గొప్ప నాయకుడు, మేధావి, ట్రబుల్ షూటర్అని కొనియాడారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆత్మకు శాంతి కలగాలని ఎంపీ నామ ప్రార్ధించారు.
ఇవీ చూడండి:భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం
Last Updated : Aug 31, 2020, 8:45 PM IST