అంబేడ్కర్ నివాసం 'రాజగృహ'పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాడ్ చేస్తూ.. ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ ఆందోళనలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. అంబేడ్కర్ ఇంటిపై దాడి చేసిన వారిని గుర్తించి వారిపై రాజద్రోహం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టాలన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.
వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి: మందకృష్ణ - kammam district latest news
ముంబయిలోని అంబేడ్కర్ నివాసం 'రాజగృహ'పై దాడి చేసిన నిందితులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చేసిన ధర్నా పాల్గొన్నారు.
వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి: మందకృష్ణ
దాడి సమయంలో అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ ఆ నివాసంలోనే ఉన్నారని తెలిపారు. అంబేడ్కర్ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. నేటి నుంచి ఈనెల 18 వరకు జరిగే నిరసన కార్యక్రమాల్లో ఎమ్మార్పీఎస్ శ్రేణులు భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :సీఐ ఇంట్లో రూ.3 కోట్ల ఆస్తులు.. కూపీ లాగుతున్న అనిశా