నామ నాగేశ్వరరావుకు మాతృ వియోగం - తెరాస లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావుకు మాతృ వియోగం
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు తల్లి వరలక్ష్మి నేడు తుదిశ్వాస విడిచారు. 15 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆసుపత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం చనిపోయారు.

నామ నాగేశ్వరరావుకు మాతృ వియోగం
తెరాస లోక్ సభ పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావుకు మాతృ వియోగం జరిగింది. ఆయన తల్లి వరలక్ష్మి 15 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం చనిపోయారు. భౌతికకాయాన్ని ఈ రోజు సాయంత్రం ఖమ్మం తీసుకురానున్నారు. ఈ మేరకు ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.