తెలంగాణ

telangana

ETV Bharat / city

రైతులకు మద్దతుగా ఎంపీ నామ, మంత్రి పువ్వాడ నిరసన - nama nageswara rao participated in bharat bandh

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా ఖమ్మంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు. బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

mp nama nageswara rao protested against new agriculture bills in khammam
mp nama nageswara rao protested against new agriculture bills in khammam

By

Published : Dec 8, 2020, 3:21 PM IST

భారత్​ బంద్​కు మద్దతుగా ఖమ్మంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద... తెరాస లోక్​సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​, రైతుసమన్వయసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి ధర్నా నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నేతలు నిరసన తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

mp nama nageswara rao protested against new agriculture bills in khammam

ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పార్టీ కార్యదర్శి తాతా మధు, ఖమ్మం మేయర్ పాపాలాల్, సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మందడపు సుధాకర్, మద్దినేని స్వర్ణకుమారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

mp nama nageswara rao protested against new agriculture bills in khammam

ఇదీ చూడండి: సన్నరకాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోంది: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details