గోదావరి జలాలతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని పునీతం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. కట్టలేరుపై నిర్మించనున్న చెక్‌డ్యామ్‌కు కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెంలో రూ.4 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి వనరుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులతో వేలాది ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయన్నారు. భూగర్భ జలాల పెంపుకు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం దోహద పడుతుందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఎన్ఎస్పీ ఆయకట్టుకు అందించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. జూన్ నాటికి ఆ నీటిని తరలించేందుకు సత్తుపల్లి నియోజకవర్గానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.