రాష్ట్రంలో తెరాస పాలన రైతు సంక్షేమ రాజ్యంగా సాగుతోందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి... హరితహారంలో భాగంగా పలుచోట్ల మొక్కలు నాటారు. పంటల సాగులో రైతులను చైతన్య వంతుల్ని చేసి సమగ్ర పంటల సాగు విధానంతో అధిగ దిగుబడులు సాధించవచ్చని మంత్రి తెలిపారు. రైతులను దిశానిర్దేశం చేసేందుకు రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్ష్యం మేరకు రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆరో విడత హరితహారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి పువ్వాడ... పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లోని పలుగ్రామాల్లో మొక్కలు నాటారు.
చైతన్యం కోసమే రైతు వేదికలు
ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ బాలసానితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. చర్ల మండలంలోని లక్ష్మినగర్, ఆర్ కొత్తగూడెం, మహదేవపురం గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. చర్లలో రూ. 1.19 కోట్లతో నూతనంగా నిర్మించిన 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. దుమ్ముగూడెం, చర్లలో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మీ ఓటు వద్దు.. ప్రేమ కావాలి