మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి తెలంగాణ రాష్ట్రానికి, తెరాసకు తీరని లోటని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా తెరాస కార్యాలయంలో నాయిని చిత్రపటానికి నివాళులు అర్పించారు.
నాయిని మృతి తెలంగాణకు తీరనిలోటు: పువ్వాడ - ఖమ్మంలో నాయిని నర్సింహరెడ్డికి నివాళులు
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా తెరాస కార్యాలయంలో నాయిని చిత్రపటానికి నివాళులు అర్పించారు.

తొలి హోంశాఖ మంత్రిగా నాయిని సీఎం మెప్పు పొందారు: పువ్వాడ
ఉద్యమకాలంలో కేసీఆర్‌కు కుడి భుజంగా ఉన్నారని కొనియాడారు. తెలంగాణ తొలి హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలను కాపాడి సీఎం మెప్పు పొందారన్నారు. నివాళులు అర్పించి వారిలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, కార్పోరేటర్లు పాల్గొన్నారు.