ఖమ్మంలో నత్తనడకన నడుస్తున్న పనుల పట్ల మంత్రి అజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి పనులు కొనసాగింపు కుదరదని పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరంలో ఉదయం పూట... కలెక్టర్ కర్ణన్, నగర కమిషనర్ అనురాగ్‌తో కలిసి సైకిల్‌పై తిరుగుతూ పనులను పరిశీలించారు. జడ్పి సెంటర్, చర్చికాంపౌండ్, శ్రీనివాసనగర్, మూడవ పట్టణ ప్రాంతం, డిపో రోడ్డు, ఎన్నెస్టీ రోడ్లో చేపట్టిన రహదారి వెడల్పు, డ్రైనేజీ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు.
ఖమ్మంలో సైకిల్‌పై మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన - minister puvvada ajay latest news
ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సైకిల్ తొక్కుతూ పర్యటించారు. ఉదయం పూట కలెక్టర్ కర్ణన్, నగర కమిషనర్ అనురాగ్‌తో కలిసి రహదారి వెడల్పు, డ్రైనేజీ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. ఖమ్మంలోని అన్ని రోడ్లు, డ్రైన్లు పక్కగా నిర్మించి... నగరాభివృద్ధిని ప్రజల కళ్లముందు ఉంచుతామని మంత్రి తెలిపారు.
'ఖమ్మం నగరాభివృద్ధిని ప్రజల కళ్ల ముందుంచుతాం'
ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేయాలని అజయ్ సూచించారు. అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. నగర అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ఇచ్చిన రూ. 30 కోట్లు.. బడ్జెట్‌లో కేటాయించిన రూ. 150 కోట్లతో ఖమ్మంలోని అన్ని రోడ్లు, డ్రైన్లు పక్కగా నిర్మించి... నగరాభివృద్ధిని ప్రజల కళ్లముందు ఉంచుతామని మంత్రి తెలిపారు.