ఖమ్మంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. నగరంలోని వివిధ డివిజన్లలో పర్యటిస్తూ... అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. నగరంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేశామన్నారు.
'ప్రభుత్వ భూమిలో ఉంటున్న వారికి త్వరలోనే పాసుపుస్తకాలు' - మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వార్తలు
ఖమ్మంలోని పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యటించారు. ఎన్నడూ లేని విధంగా ఖమ్మంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూమిలో ఉంటున్న వారికి పాసుపుస్తకాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
'ప్రభుత్వ భూమిలో ఉంటున్న వారికి త్వరలోనే పాసుపుస్తకాలు'
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి... హక్కులు కల్పించి పాసుపుస్తకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు తెరాస ప్రభుత్వం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని మంత్రి వెల్లడించారు.