విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ల్యాప్టాప్లు అందజేశారు. ఖమ్మం ఐటీహబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో 45 మందికి మంత్రి ల్యాప్టాప్లు పంపిణీ చేశారు.
విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించిన మంత్రి పువ్వాడ
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఫౌండేషన్ను మంత్రి అభినందించారు.
విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించిన మంత్రి పువ్వాడ
ల్యాప్టాప్లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు వెనిగళ్ల రవి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పసుమర్తి రంగారావు, వెనిగళ్ల అనిల్ కుమార్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'మార్చిలో వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్'