తెలంగాణ

telangana

ETV Bharat / city

'మేధావి వర్గంతో సీఎం కేసీఆర్​కు ఉన్న పేగుబంధాన్ని విడదీయలేరు' - mlc election campaign updates

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపు ఖాయమన్న నేతలు... విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

minister puvvada ajay kumar and mp nama nageswara rao in mlc election campaign at khammam
minister puvvada ajay kumar and mp nama nageswara rao in mlc election campaign at khammam

By

Published : Mar 5, 2021, 10:18 PM IST

తెరాస ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్​కు మేధావులు, ఉద్యోగులు, పట్టభద్రులతో ఉన్న పేగుబంధాన్ని ఎవరూ విడదీయలేరని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మేధావి వర్గాన్ని తెరాసకు దూరం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో నిర్వహంచిన బహిరంగ సభలో మంత్రి విపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్రంలోని సబ్బండవర్గాలు కేసీఆర్​తోనే ఉన్నాయన్నారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిన భాజపాకు.. రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని ఎంపీ నామ నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్రానికి తెలంగాణ సొమ్ము ఇచ్చిందా.. తెలంగాణనే కేంద్రానికి ఇచ్చిందా లెక్కలు చెప్పేందుకు తాను సిద్ధమని ఉద్ఘాటించారు. ఉద్యోగాల విషయంలో తెరాస చెప్పే లెక్కలు తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో పోరాటాలు, ఉద్యమాలకు వారసత్వం తెరాసదేనని.. విజయాలు కూడా తెరాసకేనని తెలిపారు.

ఇదీ చూడండి:సెగలు పుట్టిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details