ఖమ్మంలో ఎంపీ నామ నాగేశ్వరావు ఆదేశాల మేరకు నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో మాస్కులు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం నగరంలోని టేకులపల్లి డబుల్ బెడ్ రూమ్ నిర్మాణంలో మధ్యప్రదేశ్ వలస కూలీలకు భోజనం పెట్టారు. నగరంలోని పెట్రోల్ బంకుల్లో పని చేస్తున్న సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు.
'నామ ముత్తయ్య ట్రస్టు' మాస్కుల పంపిణీ, అన్నదానం - ఖమ్మంలో పెట్రోల్ బంకు సిబ్బందికి మాస్కుల పంపిణీ
నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆద్వర్యంలో ఖమ్మలోని పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణంలో పనిచేస్తున్న వలస కూలీలకు అన్నదానం చేశారు.
'నామ ముత్తయ్య ట్రస్టు' మాస్కుల పంపిణీ, అన్నదానం
లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందికి, పోలీస్, జర్నలిస్టులకు, పారిశుద్ధ్య కార్మికులకు... మాస్కులు, శానిటైజర్లు, వాటర్ బాటిళ్లను అందచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నామ సేవసమితి అధ్యక్షుడు పాల్వంచ రాజేష్, ప్రధాన కార్యదర్శి చీకటి రాంబాబు, ఉపాధ్యక్షుడు సరిపూడి కోపి సందేశ్, రావూరి శ్రీను, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'వేసవిలో భారత్ కరోనాను జయించొచ్చు!'
Last Updated : Apr 24, 2020, 4:47 PM IST