భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏఎస్పీ రాజేష్ చంద్ర ఎదుట మహిళా మావోయిస్టు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక జనజీవన స్రవంతిలో కలిసేందుకు పార్టీ నుంచి బయటకు వచ్చి లొంగిపోయినట్లు ఏఎస్పీ వివరించారు. కలుమ దేవి 2014 నుంచి మావోయిస్టు పార్టీలో శబరీ ఎల్వోఎస్ డిప్యూటీ కమాండర్‌గా పనిచేసినట్లు తెలిపారు.
మావోయిస్టు డిప్యూటీ కమాండర్ లొంగుబాటు - భద్రాచలంలో మావోయిస్టు లొంగుబాటు
మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ఓ మహిళా మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. ఆమెకు రావాల్సిన అన్ని రివార్డులు, రాయితీలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర అన్నారు.
ఏఎస్పీ రాజేష్ చంద్ర ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు
మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న ఆమె జనజీవనంలో కలిసిపోతున్నందుకు రాజేష్‌చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రివార్డులు, రాయితీలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏఎస్పీ హామీ ఇచ్చారు.