తెలంగాణ

telangana

ETV Bharat / city

బాటసారి ఆకలి తీర్చిన పోలీసులు - Police Food Distribution Migrant Labour

యజమాని పని నుంచి తీసేయడం వల్ల స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న కార్మికుడి ఆకలిని ఖమ్మం జిల్లా ఇల్లందు పోలీసులు తీర్చారు. అతనికి భోజనం పెట్టి... మంచినీళ్లు అందించి... ఆటోలో అతని స్వగ్రామానికి పంపించారు.

బాటసారి ఆకలి తీర్చిన పోలీసులు
బాటసారి ఆకలి తీర్చిన పోలీసులు

By

Published : Apr 18, 2020, 7:40 PM IST

ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఓ వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏన్కూరు మండలంలో పని కోసం వెళ్లాడు. లాక్‌డౌన్‌ వల్ల యజమాని అతడిని పని నుంచి తీసేశాడు. ఆ కార్మికుడు తన సామాను నెత్తిన పెట్టుకొని స్వగ్రామానికి నడుచుకుంటూ బయల్దేరాడు. ఖమ్మం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అతన్ని గుర్తించారు. అతని వివరాలు తెలుసుకుని భోజనం, మంచినీళ్లు అందించారు. స్వగ్రామానికి ఆటోలో పంపించి తమ ఔదార్యం చాటారు.

ABOUT THE AUTHOR

...view details