మొదటి కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో గోదావరి నది వద్ద భక్తుల సందడి మొదలైంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నది ఒడ్డున ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
భక్తి పారవశ్యం.. భద్రాద్రిలో జన సందోహంగా గోదారి తీరం - కార్తికమాస పూజలు 2020
గోదారి తీరం జన సందోహంగా మారింది. కార్తిక మాసం పూజలతో కొత్తశోభను సంతరించుకుంది. భద్రాద్రిలో రాములోని పుణ్యక్షేత్రం పరిసరమంతా భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచే మహిళలు భారీగా తరలివచ్చి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు.

భక్తి పారవశ్యం.. భద్రాద్రిలో జన సందోహంగా గోదారి తీరం
భక్తి పారవశ్యం.. భద్రాద్రిలో జన సందోహంగా గోదారి తీరం
కార్తికమాసం సందర్భంగా భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు.
Last Updated : Nov 16, 2020, 9:40 AM IST