ఖమ్మం జిల్లా కామేపల్లిలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వ్యవసాయంపై మక్కువతో తహసీల్దార్ కనకం నరసింహారావు ట్రాక్టర్‌తో పొలం దున్నారు. తన సిబ్బందితో కలిసి రైతులకు వ్యవసాయంపై సలహాలు, సూచనలు ఇచ్చిన తహసీల్దార్... అనతరం పొలంలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. వ్యవసాయంలో మెళుకువలు చెప్పిన అధికారే స్వయంగా పనులు చేసి చూపించి రైతులను ఉత్సాహపరిచారు.
ఆ తహసీల్దార్ చెప్పడమే కాదు.. చేసి చూపించాడు - వరినాట్లు వేసిన తహసీల్దార్ కనకం నరసింహారావు
చెప్పేవాడికి వినేవాడు లోకువ.. అనే సామెతకు భిన్నంగా చేసి చూపించాడు ఖమ్మం జిల్లా కామేపల్లి తహసీల్దార్. సిబ్బందితో కలిసి రైతులకు మెళుకువలు చెప్పిన ఆయన... స్వయంగా ట్రాక్టర్‌తో పొలం దున్ని అందర్నీ ఆశ్చర్చపరిచారు.
ఆ తహసీల్దార్ చెప్పడమే కాదు.. చేసి చూపించాడు